PTM | విద్య‌తోనే భ‌విష్య‌త్

PTM | విద్య‌తోనే భ‌విష్య‌త్

  • ఘంటసాలపాలెం సీబీసీఎన్సీ స్కూల్లో మెగా పిటీఎమ్

PTM | ఘంటసాలపాలెం, ఆంధ్రప్రభ : విద్యతోనే చిన్నారులకు భవిష్యత్‌ ఉంటుందని సర్పంచ్ దోనే రజిని అన్నారు. మండలంలోని ఘంటసాలపాలెం సీబీసీఎన్సీ స్కూల్లో(CBCNC School) మెగా పీటీఎం కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు కొమ్ముగూరి సొలొమోను రాజు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కొల్లూరి విజయ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతగా చదివించాలని కోరారు. పాఠశాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న హెచ్ఎంను అభినందించారు. అనంతరం విద్యార్థులకు హోలీ స్టిక్ ప్రోగ్రెస్ కార్డులు(Holi Stick Progress Cards) సర్పంచ్, ఎంపీటీసీ, అతిదులు చేతులు మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్, శ్యామ్యూల్, మోషే, మానస, జయశ్రీ, తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply