భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం పీటీ ఉషతో భేటీ అయ్యారు.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పీటీ ఉషతో సీఎం భేటీ అయ్యారు. ఈ సదర్భంగా వారు నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ 2029లో జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని పీటీ ఉషను కోరినట్లు సీఎం చంద్రబాబు X వేదికగా పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఆమె మద్దతు కోరినట్లు వెల్లడించారు.
అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయడంపై చర్చించామని చెప్పారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ఉత్తమ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.