PRTU | మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి మిన‌హాయించాలి

PRTU | మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి మిన‌హాయించాలి

  • ఇంటర్మీడియట్, పదవ తరగతి బోధనా ఉపాధ్యాయులను మినహాయించాలి
  • పిఆర్టీయూ టీఎస్ – జూనియర్ లెక్చరర్ల సంఘం వినతి

PRTU | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి ఇంటర్మీడియట్ అండ్ పదవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతూ పిఆర్టీయూ(PRTU) టీఎస్ నారాయణపేట జిల్లా శాఖ అండ్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సీఎస్ కు వినతిపత్రం సమర్పించారు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, అలాగే పదవ తరగతి విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు కొనసాగుతున్న దృష్ట్యా బోధనా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల(election duties)కు నియమించడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా పిఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు వై.జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ… విద్యార్థుల పరీక్షల దృష్ట్యా ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో బోధనకు అవకాశం కల్పించాలని, ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply