Financial | ఆర్థిక భద్రత కల్పించాలి
Financial | ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సరాఫ్ నాగరాజు
Financial | నారాయణపేట, ఆంధ్రప్రభ : ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు (For Fishermen) శుభాకాంక్షలు తెలుపుతూ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సరాఫ్ నాగరాజు మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత కట్టుబడి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులు, ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అంటూ సరాఫ్ నాగరాజు అభివర్ణించారు.
మత్స్య ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతికత ప్రోత్సాహం కోసం ప్రభుత్వం మరింత ముందుకు రావాలని ఆయన సూచించారు. రిజర్వాయర్లు, చెరువులు వంటి ప్రకృతి వనరులపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భద్రత తప్పనిసరి అని సరాఫ్ నాగరాజు (Saraf Nagaraju) పేర్కొన్నారు. మత్స్య ఉత్పత్తి అభివృద్ధితో పాటు, రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమం కంటే ముందు జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమం ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోనంగిరి హనుమంతు, పట్టణ ముదిరాజ్ యువజన నాయకులు ఏ రాము, డాక్టర్ కాకర్ల భీమయ్య, జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్లు శ్రీనివాస్ (Director Srinivas) శివరామరాజు, తదితరులు పాల్గొన్నారు.

