ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తా..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా అండగా ఉంటామని విద్యార్థులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, విద్య ప్రాముఖ్యతను, ఉన్నత విద్యాభ్యాసానికి ఉన్న అవకాశాలను వివరించారు.

ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా అండగా ఉంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరంలోనే ఈ పాఠశాల స్థాపించబడిందని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమ విశేషాలు, తన విద్యా నేపథ్యాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.
ఈ వేడుకలో నల్లబెల్లి ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు క్యాతం శ్రీనివాస్, పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply