ఇల్లెందు, ఆంధ్ర‌ప్ర‌భ : ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్మన్ (Illendu Former Municipal Chairman) దమ్మాలపాటి వెంకటేశ్వరావు (డీవీ) ఇంటి ముందు మృత‌దేహంతో ధ‌ర్నా జ‌ర‌గ‌డంతో ఉద్రిక‌త్త ప‌రిస్థితి నెల‌కొంది. దుమ్మాల‌పాటి (Dammalapati) బంధువు గడిపర్తి శ్రీనివాస్ తో ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జ‌ర‌గ‌డంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న డీవీ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా శ్రీనివాస్ (Srinivas) బంధువులు మృతదేహంతో డీవీ ఇంటి ముందు ఆందోళన చేసి కారు, ఇల్లును ధ్వంసం చేశారు. పోలీసులు (Police) బందోబస్తు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. శ్రీను మృతికి కారణమైన డీవీని అరెస్టు చేయాలని శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Leave a Reply