పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 5(ఆంధ్రప్రభ): పెద్దపల్లి (Peddapalli) మండలం చీకురాయి గ్రామానికి చెందిన మొండెద్దుల అంజనేయులు గత నెల 29న రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా స్థానికంగా ప్రైవేట్ వైద్యం చేయించుకున్నాడు.

అయితే ఆర్ఎంపీ వైద్యుడు (RMP Doctor) వేసిన ఇంజక్షన్ వికటించి తన భర్త మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని భార్య, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన (Protest) చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు.

Leave a Reply