జీతం పెంచాలని నిరసన..

జీతం పెంచాలని నిరసన..
ఆంధ్రప్రభ, కోడూరు (కృష్ణా జిల్లా) : పదివేల రూపాయలు జీతంతో బతకలేకపోతున్నామని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోడూరు (Koduru) తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వీఆర్ఏలు నిరసన (VRAProtest) వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా వీఆర్ఏ నాయకులు మాట్లాడుతూ.. జీతాలను 26 వేల రూపాయలకు పెంచాలని, వీఆర్ఏలను వీఆర్వోలుగా ప్రమోషన్ (Promotion) ఇవ్వాలని, వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు (Night duties) వేయవద్దని డిమాండు చేశారు. వీఆర్ఏలకు మద్దతుగా రైతు సంఘం, రైతు కార్మిక సంఘ నాయకులు మద్దతు తెలిపారు. సంఘ నేతలు వల్లభనేని లక్ష్మణరావు, పులిగడ్డ అంకారావు, సోమయ్య, బిక్షం, రాముతో పాటు రైతు సంఘ నేతలు ఆవల బసవయ్య, పోలబత్తిన మోహన్ రావు పాల్గొన్నారు.
