ఆరోగ్య గుడివాడ నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం

ఆరోగ్య గుడివాడ నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

గుడివాడ – ఆంధ్రప్రభ : ఆరోగ్య గుడివాడ నిర్మాణంలో మనందరం భాగస్వామ్యం అవుదామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో వైద్య అధికారులు,

వైద్యులు, టెక్నీషియన్లు ఇతర సిబ్బందితో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు. వైద్య అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందిస్తున్న ,చికిత్సల వివరాలు…..అందుబాటులో ఉన్న వసతులు,సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఓపి, ఐపీ, సర్జికల్ రికార్డులు పరిశీలించారు.

ఓపీ,ల్యాబ్ టెస్టులకు…సర్జికల్స్ నిధుల ప్రపోజల్స్ మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని గుర్తించి… అధికారులను ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. సర్జికల్స్ నిధుల ప్రపోజల్ మార్పులు చేయాలని సూచించారు. సిటీ స్కాన్ సమస్యను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా…..కలెక్టర్ తో మాట్లాడి ఎమ్మెల్యే రాము సమస్యను పరిష్కరించారు. అనంతరం వివిధ విభాగాల వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు…

మెరుగైన సామాగ్రి కోసం విభాగాల వారీగా ప్రాజెక్టు ప్రపోజల్స్ రూపొందించాలని సూచించారు. గుడివాడ ఆసుపత్రి సెకండరీ కేటగిరిలో ఉండడంవల్లనే… ఐ సి యు, కావలసినంత డ్రగ్ మంజూరు కావడం లేదని వైద్య అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాలని… బాధ్యతతో పనిచేసే ప్రతి ఒక్కరికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న వైద్యులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.

ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై వైద్యులను ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. ఆ ప్రచారాలు పూర్తి అవాస్తవమని వాస్తవ నివేదికలను వైద్యులు చూపించారు. దుష్ప్రచారాలు చేసే వారిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. సమస్యలపై వైద్యులు నేరుగా తనను కలవవచ్చని, ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే తాను ఎంతవరకైనా వెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులు, ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆసుపత్రిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు.

గుడివాడ ఆసుపత్రికి సిటీస్కాన్ మంజూరు అయిందని, త్వరలో డయాసిస్ తో పాటుగా ఆధునిక వైద్య సామాగ్రి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆస్పత్రి సూపరిండెంట్ ఇందిరా దేవి, అభివృద్ధి కమిటీ చైర్మన్ జోన్స్ దయానంద్,జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, చేకూరు జగన్మోహన్రావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు, దేవేంద్రుడు, మరీదు కరుణ కుమారి ఆస్పత్రిలోని వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, తదితరులు రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply