ఇంటి పన్ను చెల్లించండి ఐదు శాతం మాఫీ పొందండి..!

ఇంటి పన్ను చెల్లించండి ఐదు శాతం మాఫీ పొందండి..!

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీ పట్టణ వ్యాపార వాణిజ్య గృహ యాజమాన్యులు ప్రభుత్వ ఉత్తర్వులమేరకు 2026..27ఆర్థిక సంవత్సరీకానికి సంబంధించిన ఇంటి పన్ను ఆస్తి పన్ను తక్షణమే చెల్లించి ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం మాఫీ పొందాలని కమిషనర్ ఎం.రంజిత్ కుమార్, చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతరమేష్ బుధవారం తెలిపారు.

ఆస్తి పన్ను ఐదు శాతం మినయింపు అవకాశం ఈనెల 30వ తేదీ వరకు ఉన్నందున పట్టణ ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ చైర్పర్సన్ కోరారు. సకాలంలో ఇంటి పన్ను ఆస్తి పన్ను నల్ల బిల్లులు చెల్లించి చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply