డీఎస్పీగా అలహరి శ్రీనివాస్

డీఎస్పీగా అలహరి శ్రీనివాస్

గుంటూరు క్రైమ్, ఆంధ్రప్రభ : గుంటూరు రేంజ్ పోలీసు విభాగంలో సేవలందిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాకు పదోన్నతులు లభించగా, అందులో అలహరి శ్రీనివాస్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఐదుగురు అధికారులకు పదోన్నతులు ప్రకటించారు.

పదోన్నతి పొందిన వారిలో షేక్ అబ్దుల్ బషీర్, పి. బాలాజీ, బి. నరసింహారావు, జి. తిరుమలరావుతో పాటు అలహరి శ్రీనివాస్ ఉన్నారు. వీరి సేవల్లో నిబద్ధత, క్రమశిక్షణ, పనితీరు ఆధారంగా ఈ పదోన్నతులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇందులో అలహరి శ్రీనివాస్ ప్రస్థానం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సుదీర్ఘ కాలంగా సీఐగా పనిచేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న ఆయనకు ఎప్పటినుంచో రావలసిన డీఎస్పీ ప్రమోషన్ ఇప్పుడు లభించడం గమనార్హం. గుంటూరు నగరంలో ఎస్పీ వకుల్ జిందాల్ మార్గదర్శకత్వంలో టాస్క్ ఫోర్స్ బృందాన్ని విజయవంతంగా నడిపిస్తూ అనేక నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించారు.

నేర నియంత్రణలో చురుకైన చర్యలు, సమర్థవంతమైన నాయకత్వం, క్రమశిక్షణతో పనిచేసినందుకు ఆయనకు సహచరులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టబోతున్న అలహరి శ్రీనివాస్ మరింత మెరుగైన సేవలు అందిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

పదోన్నతి పొందిన అధికారులు మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరై రిపోర్ట్ చేయాలని ఆదేశించగా, తదుపరి పోస్టింగులు కేటాయించే వరకు అక్కడే విధులు నిర్వహించనున్నారు. 15 రోజులలోపు కొత్త బాధ్యతలు స్వీకరించాలని డీజీపీ స్పష్టం చేశారు.

Leave a Reply