promotion | ఏసీపీగా పదోన్నతి

promotion | ఏసీపీగా పదోన్నతి
- ఎన్‌టీఆర్ జిల్లాకు సత్యానందం అటాచ్
promotion | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లా సిటీ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.సత్యానందం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎన్.టి.ఆర్. జిల్లాకు అటాచ్ చేశారు. సిటీ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
