హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఫిలిం నగర్ లో జరిగిన సమావేశం అనంతరం…. సినీ కార్మికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.
రోజువారీ వేతనం రూ.2,000 కంటే తక్కువగా ఉన్న కార్మికుల వేతనాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ వేతనాల పెంపును మూడు విడతల్లో అమలు చేయనున్నారు. మొదటి సంవత్సరంలో 15% పెంపు, రెండు, మూడవ సంవత్సరంలో 5% పెంపు ఇవ్వనున్నారు.
అలాగే, రోజువారీ వేతనం రూ.1,000 కంటే తక్కువగా ఉన్న కార్మికులకు ప్రత్యేకంగా మొదటి సంవత్సరంలో 20% పెంపు, మూడవ సంవత్సరంలో 5% పెంపును ఇవ్వడానికి నిర్మాతలు అంగీకారం తెలిపారు.
అయితే, ఈ షరతులు కార్మిక సంఘాలు అంగీకరిస్తేనే వేతనాల పెంపు ఉంటుందిన నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో ఈ నిర్ణయంపై సినీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో ఆసక్తిగా మారింది.