జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..

జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..
బికేయస్ అధ్యక్షుడు బస్వరాజ్ రెడ్డి
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలో జొన్న మొక్కజొన్నతో పాటు పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సోమవారం నాడు జుక్కల్ మండలం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల బస్వరాజ్ రెడ్డి రైతులతో కలసి జుక్కల్ తహసిల్దార్ మారుతికి, ఎంపీడీఓ బి.శ్రీనివాస్ కు వినతి పత్రాన్నీ సమర్పించారు.
దీంతోపాటు ప్రముఖంగ వరిధాన్యం పండిస్తున్న ఖండేబల్లూర్ తో పాటు పరిసర గ్రామ రైతులు కోసం తక్షణం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నీడ, నీటి వసతితో పాటు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీంతోపాటు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ ను తొలగించి రైతులు సరిపడా యూరియా ప్రభుత్వం సరఫరా చేయాలని, వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా పదుల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
