శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు..

శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక శ్రీ సీతారాముల ఆలయంలో నిర్వహించనున్న కల్యాణ వేడుకల నిమిత్తం శ్రీ సీతారామచంద్రుల దేవతా మూర్తుల విగ్రహాలను ప్రముఖ వ్యాపారవేత్త మిట్టపల్లి నగేష్ నివాసంలో పురోహితులు పి సూరిబాబు, హరిబాబు శర్మలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణ కేంద్రంలో డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా స్థానిక శ్రీ సీతారాముల ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు పన్నాల శ్రీవిద్య, కూర్మిళ్ల ప్రమీల, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు మొగుల్లపల్లి సోమయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అవిశెట్టి అవిలిమల్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.
