బృందావన్ కాల్వను శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి..

బృందావన్ కాల్వను శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఇండ్ల మధ్యనే బృందావన్ కాల్వ చెత్త చేదారంతో కంపు, దుర్వసనతో ప్రజలు అనారోగ్యం పాలౌవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, వెంటనే చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు గురువారం స్థానిక సమస్యలపై పోరుయాత్ర లో భాగంగా బృందావన్ కాల్వను పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కేంద్రంలో నివాస గృహాల మధ్యన దాదాపు అరకిలోమీటర్ పొడువున కాల్వలో చెత్త చేదారం చేరి, కంపు దుర్వాసనతో చుట్టుప్రక్కల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. మురికినీరు పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లి ఆ నీరుకూడ కలుషితం అవుతున్నాయన్నారు. అధికారులు తక్షణమే స్పందించి బృందావన్ కాల్వలో చెత్తను తొలగించి శుభ్రం చేయడంతో పాటు, కాల్వ చుట్టూ గోడ నిర్మించి ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, టౌన్ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, రైతు సంఘం జిల్లా నాయకులు పైళ్ల యాదిరెడ్డి, గుండు లక్ష్మి, మెతుకు అంజయ్య, కందుకూరి నర్సింహా,బొమ్మగాని చంద్రయ్య, ఎండీ ఇబ్రహీం, అన్నందాసు సావిత్ర, ఎండీ షాహీర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply