బహుమతులు ప్రదానం..

  • ఇష్టంతో చదివితే..

దండేపల్లి, (ఆంధ్రప్రభ): దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో బిగ్ హెల్ప్ ఎడ్యుకేషన్ అనే స్వచ్చంద సంస్థ సహకారంతో నిర్వహించిన ఎఫ్ ఏ2 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి తరగతిలో పది మంది పిల్లలకు శనివారం గోల్డ్ స్టార్ బహుమతులను అందచేశారు. ఈ బహుమతులను మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంత్రి రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఇష్టంతో చదువుకుంటే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ ఎండి శరీఫోద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply