పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్,జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ పిలుపునిచ్చారు. సోమవారం కమ్మర్ పల్లి మండలం కోనా సమందర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు,ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ కలిగిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు,మధ్యాహ్న భోజనం, యూనిఫాం ప్రభుత్వం అందిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. పిడి రమేష్,జ్ఞానేశ్వర్, లక్ష్మీ నరసయ్య, మనోహర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
