PM Modi | పుట్టపర్తి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi | పుట్టపర్తి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi | పుట్టిపర్తి, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రానికి ఉదయం 9-50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు.

పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి(Narendra Modi) కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎంపీ బికేపార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, ఎంఎస్ రాజు, కందికుంట వెంకటప్రసాద్, బండారు శ్రావణి, దగ్గుపాటి ప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. 

Leave a Reply