ట్రంప్ కు ప్ర‌ధాని మోడీ ఫోన్… ఎందుకంటే !!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఈ సంభాషణ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌పై అమెరికా సుంకాల విధింపుతో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బ‌తిన్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ సంభాషణలో ప్రధానంగా వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత రంగాల్లో సహకార విస్తరణపై దృష్టి పెట్టారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇద్దరు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అలాగే రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యాపారం, సాంకేతిక సహకారాన్ని విస్తరించడం గురించి కూడా చర్చించారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడం, పరస్పర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కలిసి పనిచేయాలన్న అంగీకారానికి ఇరు దేశాల నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.

చర్చల అనంతరం ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ఎక్స్‌ (ట్విట్టర్)‌లో వెల్లడించారు. “అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా హృదయపూర్వకమైన, సానుకూలమైన సంభాషణ జరిగింది. మా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించాము. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చించాము. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం భారత్–అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి’’ అని పేర్కొన్నారు.

Leave a Reply