విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు

జైనూర్, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ జైనూర్ విద్యుత్ శాఖ సాయి కిరణ్ అన్నారు. వారు శుక్రవారం మండల కేంద్రంలోని పౌరౌజ్ కాలనీ, మోహింపుర, ఎస్సీ కాలనీ, సందర్శించి విద్యుత్ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సర్పంచ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రధాన రోడ్లు ఇరువైపున త్రీఫేస్ సౌకర్యంతో పాటు ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలు స్థితుల వ్యవస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్ సరఫరా లో అధిక లోడు పడకుండా అవసరం ఉన్నచోట్ల నూతన మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 20వరకు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలుతీ సుకుంటున్నామని వారి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయాలు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షేక్ రహీం, విద్యుత్ శాఖ ఎల్ఐ ప్రవీణ్, ఉద్యోగి ఇర్ఫాన్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply