President Murmu | భ‌ళా.. తెలుగు బాల‌లు!

President Murmu | భ‌ళా.. తెలుగు బాల‌లు!

  • బాల పురస్కార్ అందుకున్న తెలుగు రాష్ట్రాల ఇద్దరు పిల్లలు

President Murmu | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన మంత్రి (Primeminister) రాష్ట్రీయ బాల పురస్కార్‌ను ఇద్దరు పిల్లలు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న తెలంగాణకు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ఒకరు. తెలంగాణ మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికేయ పర్వతారోహకుడు. ఆసియా నుండి ఐలాండ్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు కావడం విశేషం.

President Murmu

అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఏపీకి (AP) చెందిన పారా అథ్లెట్ శివాని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన శివానిది నిరుపేద కుటుంబం. ప్రస్తుతానికి హైదరాబాదులోని స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటుంది. తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తుంటారు.

CLICK HERE TO READ తిరువ‌నంత‌పురంలో మేయ‌ర్ పీఠం బీజేపీ కైవ‌సం

CLICK HERE TO READ MORE

Leave a Reply