President | వికసిత్ భారత్ లక్ష్యం.. ముర్ము

President | వికసిత్ భారత్ లక్ష్యం.. ముర్ము
President | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందరికీ అందాలని అంబేడ్కర్ ఆకాక్షించారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామన్నారు. రూ.100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్రపతి అన్నారు.
అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులు, పాల ఉత్పత్తిలోనూ భారత్ ముందంజలో ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆక్వారంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. ఉత్పత్తి రంగంలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలతో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానానికి చేరిందన్నారు. అవినీతి రహిత పాలనను అందించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని, ఫలితంగా ప్రజాధనంలో ప్రతీ పైసాను దేశ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామన్నారు.
