PremierLeague2026 | ధనాధన్ సమరానికి వేళాయె!

PremierLeague2026 | ధనాధన్ సమరానికి వేళాయె!
నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్- 2026
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ కు రంగం సిద్ధం
బరిలోకి ఐదు జట్లు తొలి మ్యాచ్ ముంబై, బెంగళూరుఢీ
రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,
జియో హాట్ స్టార్‌లో ప్రత్యక్షప్రసారం
PremierLeague2026 | ముంబై: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల క్రికెట్ మహా సమరం డబ్ల్యూపీఎల్ 2026 ఆరంభానికి రంగం సిద్ధమైంది. జనవరి 9 (నేటి) నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ ప్రారం భం కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఈ మహిళల ధనాధన్ టోర్నీ షురూ అవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకుంటాయి. ఫిబ్రవరి 5న వడోదరలో జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ మెగా లీగ్ ముగుస్తుంది. ఫైనల్‌తో సహా మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 5 జట్లు (ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్) పోటీ పడుతున్నాయి.
PremierLeague2026 | మహిళల లీగ్ కు విశేష ఆధారణ…
పురుషుల ఐపీఎల్ లాగా 2023లో బీసీసీఐ ఆధ్వర్యంలో గ్రాండ్ ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌కు కూడా అభిమానుల నుంచి విశేషమైన ఆధారణ లభిస్తోంది. టోర్నీ మొదలు పెట్టినప్పుడు అమ్మాయిల మ్యాచ్‌లు చూసేందుకు ఎవరూ వస్తారని కొందరూ హేళన చేశారు. కానీ, మెన్స్ లీగ్ లాగే మహిళల పోటీలకు కూడా అభిమానుల నుంచి అసాధార ణమైన రెస్పాన్స్ వచ్చింది. తమ ఫెవరెట్ స్టార్ క్రికెటర్లను చూసేందుకు ప్రేక్షకులు స్టేడి 1 యాలకు పోటెత్తున్నా భారత్ తో పాటు విదే శీ జట్ల స్టార్ క్రికె టర్లు కూడా ఈ మెగా టోర్నీలో ఆడుతూ సందడి చేస్తు న్నారు. దేశంలోని యువ టాలెంట్ ను వెలికి తీసేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో యువ క్రికెటర్లు తమ అద్భుత ప్రదర్శనలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో కొందరూ నేరుగా భారత……… మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
