అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ

అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బొల్లం శ్రీధర్, వార్డు సభ్యులు లింగాల శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.

వాటి ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శిశువుల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే చిన్నారుల బరువు, ఎత్తును క్రమం తప్పకుండా పరిశీలిస్తూ వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కనకలక్ష్మి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply