Prasanth Neel | ఎన్టీఆర్ మూవీ తెర వెనుక ఏం జరుగుతోంది..?
Prasanth Neel, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో భారీ యాక్షన్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. జూన్ 25న రిలీజ్ అంటూ పోస్ట్ పోన్ చేశారు. వార్ 2 తర్వాత ఈ మూవీ షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. దీంతో జూన్ 25న అయినా ఈ క్రేజీ మూవీ వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఈ పాన్ ఇండియా మూవీ అప్ డేట్ ఏంటి..? ఈ మూవీ తెర వెనుక ఏం జరుగుతోంది..?
వార్ 2 ఎఫెక్ట్..
వార్ 2 సినిమా పై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఆ సినిమా అంచనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ సినిమా రిజెల్ట్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ పై బాగా ఎఫెక్ట్ చూపించింది. అందుకనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ కథ పై కసరత్తు చేశారని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ ను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా.. చాలా పవర్ ఫుల్ గా.. చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈ సినిమా పై ఎంతో కేర్ తీసుకుంటున్నారట. ఇంకా చెప్పాలంటే.. ప్రశాంత్ నీల్.. తన కెరీర్ లోనే ది బెస్ట్ స్క్రిప్ట్ ఇదే అని చెబుతున్నారట. దీనిని బట్టి ఎంత ఇష్టంతో ఈ సినిమా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు..

ఫిల్మ్ సిటీలో.. ఎన్టీఆర్..
ఇంతకీ.. ఈ పాన్ ఇండియా మూవీ అప్ డేట్ ఏంటంటే.. వార్ 2 తర్వాత షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన నీల్.. ఇప్పుడు తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణం పై యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడు వారాలు పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలిసింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని.. ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణీ వసంతన్ నటిస్తుంది. కేజీఎఫ్ మూవీకి సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.
జూన్ 25 కష్టమే..
ఈ సినిమా జూన్ 25న వస్తుందా..? అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. కారణం ఏంటంటే.. ఆగష్టు నుంచి షూటింగ్ కి బ్రేక్ పడింది. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరిగుంటే.. జూన్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే.. షూటింగ్ కి దాదాపు నాలుగైదు నెలల బ్రేక్ పడడంతో షూట్ చేయాల్సింది చాలా వుంది. అందుచేత జూన్ 25న ఈ సినిమా రిలీజ్ చేయడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే.. రిలీజ్ డేట్ పై ఫోకస్ పెట్టకుండా షూటింగ్ చేస్తున్నారట. ఏది ఏమైనా.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


