Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా?

Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా?

  • ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ ప్రారంభం
  • ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే ప్రచారంపై హల్‌చల్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన రూమర్స్
  • ఫేక్ న్యూస్‌పై ప్రకాష్ రాజ్ స్పందన
  • స్పిరిట్ మూవీలో ప్రకాష్ రాజ్ పాత్రపై క్లారిటీ

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తోన్న మూవీ స్పిరిట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ షూటింగ్ ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో.. అప్పుడే ప్రకాష్‌ రాజ్ స్పిరిట్ నుంచి బయటకు వచ్చేసారని.. సందీప్ రెడ్డి వంగతో గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ప్రకాష్ రాజ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ.. ఏమైంది..?

Spirit

స్పిరిట్ మూవీ షూటింగ్ కాక ముందు సందీప్ రెడ్డి వంగ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపించడంతో కీలక పాత్ర చేస్తున్నారని అర్ధమైంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ లో సందీప్ రెడ్డి వంగతో ప్రకాష్ రాజ్ కు గొడవ జరిగిందని.. అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు రావడంతో సినీ అభిమానులకు షాక్ అయ్యారు. ఇక అక్కడ నుంచి ప్రకాష్ రాజే తప్పుకున్నాడా..? లేక సందీప్ రెడ్డి వంగ తీసేసాడా..? ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడితో ఆగకుండా ప్రకాష్ రాజ్ పాత్రను ఎవరితో చేయిస్తారో అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

Spirit

అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే.. అసలు నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగే ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే మీ వాట్సాప్ ఫ్యాక్టరీలో కథలు అల్లేస్తున్నారా? కాస్త ఎదగండి.. మీ పనులు మీరు చూసుకోండి అంటూ ఇది ఫేక్ న్యూస్ అని.. క్రియేట్ చేసిన వాళ్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ప్రకాష్‌ రాజ్. దీనిని బట్టి స్పిరిట్ మూవీలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. తప్పుకులేదనేది క్లారిటీ వచ్చేసింది. ప్రకాష్‌ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2027లో రిలీజ్ కానుంది.

CLICK HERE TO READ  క్రేజీ స్టార్‌తో హీరోయిన్ ఇమాన్వి సినిమా?

CLICK HERE TO READ MORE

Leave a Reply