praja dharbar | రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్..

praja dharbar | రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్..

praja dharbar | రాయపోల్, ఆంధ్ర ప్రభ: రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాల్లో అమలైన ఉపాధి హామీ పనుల్లో రికార్డుల నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని సోషల్ ఆడిట్‌లో తేలిందని సిద్దిపేట జిల్లా అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.“ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో ప్రతి రూపాయి లెక్కలు స్పష్టంగా ఉండాలి. కానీ కొన్ని గ్రామాల్లో రికార్డులు సరిగా నిర్వహించకపోవడం గమనించాం. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం,” అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులపై రూ.49 వేల జరిమానా విధిస్తున్నట్లు, అలాగే రూ.58,031 రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.


అయితే వారం రోజుల్లోపు అవసరమైన అన్ని రికార్డులను జిల్లా అధికారుల వద్ద సమర్పిస్తే రికవరీ మొత్తంలో కొంతమేర సడలింపు ఇచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. “ఇకపై ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలి,” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీడీ సతీష్, ఎంపీడీవో శ్రీనివాస్, అంబుడ్స్‌మెన్ ఆరిఫ్ అలీ, క్యూసీ సతీష్ రెడ్డి, విజిలెన్స్ మేనేజర్ గణేష్, ఎంపీఓ శివకుమార్, ఏపీఓ జనార్ధన్, ఏఈ రాంకుమార్ ఏపీవో జనార్ధన్ ఎంపీ ఓ శివకుమార్ వివిధ గ్రామాల సర్పంచ్లు వాసుదేవ్ పర్వేజ్ నరసింహారెడ్డి నిర్మల స్వామి శశికాంత్ అలాగే వివిధ గ్రామాల సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply