Prabhas | ఫౌజీ ప్లాన్ మారిందా..?

Prabhas | ఫౌజీ ప్లాన్ మారిందా..?
Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ మూవీ ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ (Raja Saab) మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ హర్రర్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ నెక్ట్స్ మూవీ పై అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంతకీ.. ఫౌజీ ఎంత వరకు అయ్యింది..? అసలు ఫౌజీ ప్లాన్ ఏంటి..?
Prabhas | రెండు విభిన్న పాత్రల్లో..
ప్రభాస్ హీరోగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి.. ఫౌజీ చిత్రాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా.. చాలా డిఫరెంట్ స్టోరీని అందిస్తున్నారట. ఈ భారీ, క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ (Prabhas) రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకటి బ్రిటీష్ సైనికుడు అయితే.. రెండోది బ్రాహ్మణ యువకుడు పాత్ర అని ప్రచారం అయితే జరుగుతుంది కానీ.. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. సీతారామమ్ తర్వాత హను తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో.. ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.

Prabhas | ఫౌజీ స్పీడు పెరగబోతుందా..
ఇక అసలు విషయానికి వస్తే.. రాజాసాబ్ మూవీ నిరాశపరచడంతో.. ఫౌజీ సినిమా అదిరిపోవాలి అంటూ అభిమానులు హను రాఘవపూడి పై ఇప్పటి నుంచే ప్రెజర్ పెంచుతున్నారు. అలాగే వీలైనంత త్వరగా ఫౌజీ సినిమాని రిలీజ్ (Release) చేయాలి అంటున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు డబ్బై శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇంకా ముప్పై శాతం షూటింగ్ చేయాల్సివుంది. ఇప్పటి వరకు ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయాలనేది ప్లాన్. అయితే.. ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ చేయడం కష్టమే అని.. అక్టోబర్ లో ఫౌజీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది. కానీ.. రాజాసాబ్ ఎఫెక్ట్ ఫౌజీ పై పడిందని.. సాధ్యమైనంత త్వరగా ఫౌజీని విడుదల చేయాలని ప్లానింగ్ జరుగుతుందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

