prabhanews.com| మంచి వార్తలతో పాఠకులకు చేరువవుతున్న ఆంధ్రప్రభ
prabhanews.com| మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Andhraprabha | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : మంచి వార్తలతో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ (Andhraprabha) దినపత్రిక రోజు రోజుకీ పాఠకులకు చేరువ అవుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. హుజూర్‌నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రభ బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ మీడియా ప్రభంజనంలో ప్రింట్ మీడియా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటుందన్న పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు నిర్భయంగా చెప్పాలన్న ఒకే ఒక్క ఆలోచనతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆంధ్రప్రభ యాజమాన్యం సరికొత్త హంగులతో పత్రికను తీర్చిదిద్ది పాఠకులకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు.

prabhanews.com | పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు
ఆంధ్రప్రభ (Andhraprabha) స్మార్ట్, వెబ్ , యూట్యూబ్ ఛానల్స్ ను ఏర్పాటు చేసి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని పాఠకులకు ఎప్పటికప్పుడు అందజేయడంలో ఆంధ్రప్రభ అన్ని పత్రికల కంటే ముందుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన విధంగా
ఆంధ్రప్రభ వెబ్ ( prabhanews.com ) ద్వారా క్షణాల్లో వార్తను ప్రచురించడం సంతోషంగా ఉందన్నారు. పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని, స్వాతంత్ర పోరాటంలో పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు.
prabhanews.com | ఉత్తం కుమార్ రెడ్డి హామీ
ఆంధ్రప్రభ దినపత్రిక అభివృద్ధి(Development) కి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఎం దంతాల ప్రవీణ్ కుమార్, హుజూర్‌నగర్ రిపోర్టర్లు ఉషశ్రీ, ధూళిపాళ శ్రీనివాస్, కందుల సురేష్, సర్కులేషన్ టీం కృష్ణమూర్తి, నజీర్ పాల్గొన్నారు.

