ఆంధ్ర ప్రభ ఏఫెక్ట్…

ఆంధ్ర ప్రభ ఏఫెక్ట్…
పైపు లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన అధికారులు
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలోని చిన్న మోరీ కాలువ నుండి మారుతీ నగర్ కాలనీకి వెళ్ళే పైపు లైన్ లీకేజీనీ సమస్యను అధికారులు స్పందించి పరిష్కరించారు.ఆదివారం ఆంధ్ర ప్రభ లో ప్రచురితమైన కథనానికి అధికారులు ఎంపిడిఓ చింత.రాజ శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శి నవీన్ స్పందించి ఆఘ మేఘాల మీద పైపు లైన్ లీకేజీ మరమ్మత్తులు చేయించారు. గ్రామ ప్రజలు ఆంధ్రప్రభ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
