పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న అత్యంత ఆసక్తికర గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. అయితే, దానికి తగ్గట్టుగానే చిత్రబృందం కూడా ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ ఆదివారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే ట్రైలర్‌కు ముందే, అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్‌ను అందించారు మేకర్స్. పవన్ కళ్యాణ్ స్వరపరిచిన జపనీస్ డైలాగ్ “Washi Yo Washi” ను రిలీజ్ చేశారు.
దీనిలో పవర్‌స్టార్ ఎనర్జీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ‘‘మై డియర్ ఓమి.. ఎగిరి ఎగిరి పడుతున్నావ్.. నీలాంటి వాడిని కిందికి ఎలా దించాలో నాకు బాగా తెలుసు’’ అంటూ మొదలైన ఈ డైలాగ్, ఆకాశంలో ఎగిరే గద్దను ఎలా చంపాలో వివరిస్తూ పవన్ మాస్ వార్నింగ్‌ను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాతలు డివివి దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ “OG” గంభీరా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా ఓమీ పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది ఆయన తొలి తెలుగు సినిమా. హీరోయిన్‌గా ప్రియాంకా మోహన్ నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్ సత్య దాదాగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, సౌరవ్ లోకేశ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నారు.

