ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల గణన, సర్వేతోపాటు.. ఎస్సీ రిజర్వేషన్లపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాలులో మధ్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షీ హాజరుకానున్నారు.
కాగా, కులగణనపై మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర రాజ నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ బాద్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే లు, కార్యవర్గ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కోరారు.