ఆధ్యాత్మికవేత్త సంత్ రవిదాస్ పోస్టర్ ఆవిష్కరణ

ఆలేరు, ఆంధ్రప్రభ : గొప్ప ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘసంస్కర్త సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని పోస్టర్ ఆవిష్కరణ ఆలేరులోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో జరిగింది. సామాజిక సమరసత వేదిక, యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిలభారత కళాప్రముఖ్, తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. కులమతాలు లేవని, పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదని, అందరూ సమానమేనని, చేసే కర్మల వల్ల మాత్రమే గౌరవం లభిస్తుందని, భగవంతుని చేరుకోవడానికి ఆడంబరాలతో కూడిన పూజలు అక్కర లేదని, నిశ్చలమైన భక్తి ఉంటే చాలు చాలునని సంత్ రవిదాస్ బోధనలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కళాప్రముఖ్ బండిరాజుల శంకర్, జిల్లా కన్వీనర్ పులమేని అంబేద్కర్, ఆలేరు మోచీ సంఘం అధ్యక్షులు బెదరకోట దుర్గేశ్, సభ్యులు చంద్రగిరి రమేశ్, చంద్రగిరి లింగం, అలిసేరి వెంకటేశ్, ఉపాధ్యాయులు తరిగొప్పుల రమేశ్, నారగోని భీమేశ్, బొడ్డు రమేశ్, జూకంటి సిద్ధులు, పిస్కె గణేశ్, పంతంగి శివ తదితరులు పాల్గొన్నారు.
