కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు..

నార్సింగి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం నార్సింగి మండలంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలతో బీసీ, ఎస్సీ, బలహీన వర్గాల నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని, కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తన వర్గానికే పెద్దపీట వేస్తున్నారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే మార్కెట్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంటి కీలక పదవులు ఒకే వర్గానికి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కూడా బీసీలకు అవకాశం కల్పించకపోతే పార్టీకి నష్టం తప్పదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు క్యాడర్ దూరంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply