PORT | ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదు

PORT | ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదు
PORT | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమది రైతుపక్షపాత ప్రభుత్వమని, ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిలిప్పీన్స్, తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఒప్పందం ఉందన్నారు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన అంతర్గత వివాదాల వల్ల కాకినాడలో బియ్యం ఆగాయన్నారు.
తెలంగాణ బియ్యానికి మాత్రం ఫిలిప్పీన్స్ అనుమతి ఇచ్చిందన్నారు. కాకినాడ పోర్టు వద్ద ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ హ్యాండ్లింగ్ చేస్తోందన్నారు. గిడ్డంగి, షిప్పింగ్, బీమా అన్నీ ఫిలిప్పీన్స్ చూసుకుంటోందన్నారు. రైతుల నుంచి రికార్డు స్థాయిలో బియ్యం సేకరించామన్నారు. ఇంకా మిగిలిన బియ్యం కూడా కొంటామన్నారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
