పొరపాట్లు జరగకూడదు
- ఉల్లి ఎన్యూమరేషన్ పై
- కర్నూలు కలెక్టర్ డాక్టర్ .ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముందస్తు ఖరీఫ్ సీజన్(Kharif Season)లో వర్షాలతో దెబ్బ తిన్నఉల్లి పంటను ఎన్యూమరేషన్ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.సిరి(Dr. A. Siri) అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, మండల స్పెషల్ అధికారులతో విజయవాడ నుంచి కలెక్టర్ సిరి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఎన్యూమరేషన్ ను జాగ్రత్తగా చేయాలన్నారు.
మీరు పంపిన డేటాను వర్షపాత నివేదికతో కో రిలేట్ చేసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ తెలిపారు. ఉల్లి పంట(Onion Farmers) పక్వానికి రాక ముందే కోయకుండా, 110 రోజుల తర్వాత కోసి, తదుపరి బాగా ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకుని రైతుకు మార్కెట్‌కు తీసుకొని వచ్చేవిధంగా గ్రామ హార్టి కల్చర్(Agriculture Department) అధికారి, గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
110 రోజులు పంటను పండించకుండా, క్యూరింగ్ చేయకుండా రైతులు ఉల్లి పంటను మార్కెట్ (Market)కి తీసుకొని వస్తున్నారని, తద్వారా మంచి ధర(Prices) రైతులకు రావడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. టమోట పైన నల్ల నల్లగా మచ్చలు వస్తున్నాయని, టమోటా(Tomato Crop)కు మంచి ధర రావడం లేదని ప్రతికూల వార్తలు వస్తున్నాయన్నారు.
మొక్కల సంరక్షణ చర్యలలో భాగంగా టమోట పంట బాగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, టమోటకి మంచి ధర వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. ఉల్లి పంట క్రాప్ బుకింగ్ శనివారం లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ ఉల్లి పంట ఈ క్రాప్ బుకింగ్ 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
టెలి కాన్ఫరెన్స్ లో టీఆర్ ఓ సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.

