Polling Stations | పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

Polling Stations | పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

Polling Stations | సదాశివనగర్, ఆంధ్రప్రభ : రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది, సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. 21 గ్రామపంచాయతీల సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లు, ఎన్నికలకు వినియోగించే సామాగ్రి పోలింగ్ అధికారులకు అందించారు. ఎన్నికల సామాగ్రిని తీసుకొని పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ అధికారులు, పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, తహసీల్దార్ ఆకుల సత్యనారాయణ, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంఈఓ యోసెఫ్, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, సిబ్బంది బాపురెడ్డి, శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రశాంత్, తదితరులు ఉన్నారు.

Leave a Reply