Polling | ఘనపూర్‌లో స్వల్ప ఉద్రిక్తత

Polling | ఘనపూర్‌లో స్వల్ప ఉద్రిక్తత
ఎస్ఐ సత్వర చర్యలతో పరిస్థితి అదుపులోకి
Polling | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఘనపూర్ (Ghanpur) గ్రామంలో మూడవ విడత గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ఓటు వేయించేందుకు ప్రత్యర్థి వర్గాలు (Rival factions) ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది. “అతను మా వాడు” అంటూ రెండు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ సమాచారాన్ని గమనించిన ఎన్నికల నిర్వహణలో ఉన్న ఎస్ఐ వి.సతీష్ వెంటనే తన సిబ్బందితో పరిస్థితిని నియంత్రించారు. గొడవకు దిగుతున్న వారిని లాఠీ ఛార్జ్‌తో చెదరగొట్టి శాంతిభద్రతల (law and order)ను పునరుద్ధరించారు. పోలీసుల చర్యలతో అక్కడ చేరిన ప్రజలు చెల్లాచెదురుగా వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అధికారుల జోక్యంతో పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో మరిన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

