Polling | తొలివిడత ముగిసిన పోలింగ్!
- ఫలితాలపై ఉత్కంఠ
- సర్పంచ్, ఉప సర్పంచ్ తేలేది కూడా ఈ రోజు సాయంత్రం
Polling | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తొలి విడత పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్(Polling) ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే కొన్నికేంద్రాల్లో ఇంకా ఓటర్లు బారులు తీరారు.
నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాల ఎదుట క్యూ లైన్ల(queue lines)లో ఉన్న ఓటర్లుకు ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే ముగిసిన పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం రెండు నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో తొలి దశలో 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్(notification)ను ఎన్నికల కమిషనర్ జారీ చేశారు.
ఇందులో ఐదు పంచాయతీలకు వివిధ కారాణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836 పంచాయతీల్లో పోలింగ్ ఈ రోజు జరిగింది. సర్పంచ్ పదవులకు 13,127 మంది(13,127 people), వార్డు సభ్యులకు 37,440 మంది పోటీలో ఉన్నారు. 149 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
కౌంటింగ్‌పై ఉత్కంఠ..
పోలింగ్ పూర్తయిన చోట మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్(counting) ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలపై అభ్యర్థులతోపాటు వారి మద్దతుదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే..
గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులకు పోలింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు(verification documents) అందజేస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్, వార్డు సభ్యులతో పోలింగ్ అధికారి సమావేశం ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.

