polling booth | పోలింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలి

polling booth | పోలింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలి

polling booth | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : మోడల్ పోలింగ్ కేంద్రంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అన్నారు. ఈ రోజు గ్రామపంచాయతి ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే ఆత్మకూరు మండలంలోని సర్వేపల్లి గ్రామంలో మోడల్ పోలింగ్ బూత్(Model polling booth)ని పరిశీలించారు.

మోడల్ పోలింగ్ కేంద్రం మొత్తం ప్లాస్టిక్(plastic) రహిత పోలింగ్ బూత్ గా ఏర్పాటు చేయాలని, పోలింగ్ బూత్ వద్ద వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ ఛైర్ సౌకర్యం(wheelchair facility) ఏర్పాటు చేసుకోవాలని , పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయాలని అన్నారు.

పోలింగ్ బూత్ ముందు పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు మంచి నీటి సదుపాయం, షామియానా (టెంట్) ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply