స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71 వ జయంతి

స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71 వ జయంతి

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, పిఎసిఎస్ మాదారం సొసైటీ మాజీ ఛైర్మెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంతోమంది కార్యకర్తలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన రాజకీయ చాణక్యుడు స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ గారి 71 వ జయంతి సందర్బంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను, పరకాల మున్సిపల్ 13 వ వార్డు కౌన్సిలర్ బొచ్చు మాధవిలత జాన్సన్ ముఖ్య అతిధిగా హజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ తన జీవితకాలం రాజకీయ రంగంలో అనేక మందికి సహాయ, సహకారాలు అందించిన మహనీయుడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ఒంటెరు రామూర్తి, బొచ్చు భాస్కర్, బొచ్చు సారయ్య,. బొచ్చు మహేష్, తంగళ్లపల్లి చంద్రశేఖర్, గుర్రం యాకోబు, హాస్పిటల్ సూపరిండెంట్, సివిల్ సర్జన్ డాక్టర్ గౌతమ్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పోరండ్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply