Police Warning : విగ్రహాలకు అనుమతి తప్పని సరి
లేకుంటే కఠిన చర్యలే
- బందరు డీఎస్పీ వార్నింగ్
( మచిలీపట్నం, – ఆంధ్రప్రభ) : గ్రామాలలో గాని, పట్టణాలలో గాని రహదారులపై, జన సంచారం (Crowed) ఉండే ప్రదేశాలలో విగ్రహాలను (Statues) ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బందరు డి.ఎస్.పి సిహెచ్ రాజా (Bandaru DSP) తెలిపారు.
విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. కావున ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని పోలీసువారికి సహకరిస్తూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు (Supreme Court Directions) పాటిస్తూ శాంతియుత సమాజ స్థాపనకు భాగస్వాములు అవుతారని తెలిపారు. అలాకాకుండా నియమాలు అతిక్రమించిన (Violated) ఎడల వారిపై చర్యలు ( Take Action) తీసుకుంటామని హెచ్చరించారు.

