Police station | ఎస్సైని కలిసిన ఎన్‌ఎస్‌యుఐకి శుభాకాంక్షలు…
Police station | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల నవీపేట్ పోలీస్ స్టేషన్(Police station) నుండి భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వచ్చి బాధ్యతలు చేపట్టిన ఎస్సై సిహెచ్ తిరుపతిని నిజామాబాద్ జిల్లా ఎన్.ఎస్.యూ.ఐ ఉపాధ్యక్షుడు భీమ్‌గల్ పట్టణానికి చెందిన సయ్యద్ రహమాన్, ఎన్.ఎస్.యు.ఐ యూత్ యువకులు మంగళవారం ఎస్సై సిహెచ్ తిరుపతిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్.ఎస్.యు.ఐ ఉపాధ్యక్షుడు రహమాన్ తో ఎస్పై తిరుపతి మాట్లాడుతూ… పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా మీ వంతు సహకారాన్ని పోలీసుల కు అందించాలని ఎస్పై ఎన్ ఎస్ యు ఐ యువకులకు కోరడం జరిగింది.ఎస్సైని సన్మానించిన వారిలో ఎన్ ఎస్ యు ఐ యూత్ యువకులు అబ్దుల్ అసీమ్, భూక్య నరేందర్, నితీష్, రాహుల్, ప్రకాష్, ప్రవీణ్, నందు, నరసింహ, ప్రశాంత్, తదితరులు ఉన్నారు.

