Police Station | వీడిన రైతు హత్య మిస్టరీ

Police Station | వీడిన రైతు హత్య మిస్టరీ

  • ముగ్గురు నిందితుల అరెస్టు
  • పగ..ప్రతీకారమే కారణం

Police Station | (శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ): మూడు నెలల కిందట పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు పోలీసు స్టేషన్ పరిధిలో .. కలకలం రేపిన ఓ రైతు దారుణ హత్యను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఛేదించారు. ముగ్గరు వ్యక్తులను అరెస్టు (Arrest) చేశారు. ఒకరిది భూమి కక్ష.. మరొకరిది అవమాన భారం.. వీరిద్దరూ మరొకరి తోడుతో కన్నడ రైతులు హతమార్చారు. శ్రీ సత్యపాయి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లపూర్ జిల్లా బాగేపల్లి తాలూక బిల్లూరు హొబిలి దేవర వంక గ్రామానికి చెందిన ముత్తప్పకు కొత్తూరు గ్రామానికి చెందిన కె.సురేష్ (54)కు భూ తగాదాలు ఉన్నాయి. చామాలవారి పల్లికి చెందిన సోమశేఖర్ (36) గతంలో ముత్తప్ప అన్న కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇందుకు సోమశేఖర్ ను ముత్తప్ప చెప్పుతో కొట్టించాడు. అప్పటి నుంచి సురేష్, సోమశేఖర్ పగ పెంచుకున్నారు. హత్య చేయటానికి పథకాలు రచిస్తున్నారు. బోయపల్లి గ్రామానికి చెందిన ఆనంద (42) సహకారం తీసుకున్నారు.

ఇక ముత్తప్ప 03-.09.-2025 సాయంత్రం తన టొమాటో పంట పనుల నిమిత్తం పొలంలోనే ఉండిపోయి ఇంటికి రాలేదు. 04.-09.-2025 ఉదయం 8 గంటలకు ఆమెకు అన్న వరుస శంకర్ ఫోన్ చేసి, టొమాటో (Tomoto) పొలానికి సమీపంలోని పెద్ద వంక ఒడ్డున ముత్తప్ప హత్యకు గురయ్యాడని సమాచారం ఇచ్చాడు. ముత్తప్ప భార్య ఈ నేర స్థలానికి వెళ్లి తన భర్త మృతదేహాన్ని గుర్తించి అమడగూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 04-. 09-. 2025 తేదీన Cr.No.41/2025, U/s 103 BNS r/w 3 (5) BNS ప్రకారం ఆమడగూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం (14.-12-.2025) ఉదయం 6.30 గంటలకు ఓ.డి.చెరువు మండలం మహమ్మద బాద్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సురేష్ , సోమశేఖర్ , ఆనంద కలిసి సుమారు ఆరు నెలలుగా హత్యకు పథకం రచించారు. 03.-09.-2025 రాత్రి 8.30 గంటల సమయంలో అమడగూరు మండలం ఆకులవారిపల్లి శివారులో ముత్తప్పపై ఇనుప రాడ్లతో దాడి చేసి చంపేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు ఈ సమాచారం ఇచ్చారు.

నేరగాళ్లను వదలం : ఎస్పీ

నేరాలకు పాల్పడిన నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టమని, అరెస్ట్ (Arrest) చేసి న్యాయస్థానంలో హాజరు పర్చి చట్టరీత్యా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. నేరాలను అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్ల, షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

*సిబ్బందికి అభినందనలు…

ఈ కేసు చేదింపులో కీలక పాత్ర పోషించిన నల్లమాడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వై.నరేంద్ర రెడ్డి నేతృత్వంలోని ఓడిసి పోలీస్ స్టేషన్ (Police Station) సిబ్బంది పిసి 3146 కె.లోకేశ్వరప్ప, పిసి 2554 వై.కరుణాకర్ రెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ విజయకుమార్, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సిఐలు నరేందర్ రెడ్డి, డిటిఆర్బి సిఐ శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply