మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్

మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్ నకరికల్ శాసన సభ్యులు వేముల వీరేశం ముఖ్య అనుచరుడు గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రతినిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూ గ్రామస్తులకు ఎల్లవేళలా సర్పంచిగా అందరికీ అందుబాటులో ఉంటూ పాలనలలో తనదైన ముద్ర వేసుకుంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ ముందు వరుసలో ఉంటూ అందులో భాగంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని పెద్దకాపర్తి గ్రామసర్పంచ్ కాటం వెంకటేశం ఆశ్రమంలో చేర్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ దగ్గర అనాధగా పడివున్న రాములు గుర్తించి పోలీస్ స్టేషన్ ద్వారా సమాచారం ఇచ్చి ప్రాసెస్ ప్రకారం అతడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అమ్మానాన్న అనాధ ఆశ్రమ నిర్వహకుడు గట్టు శంకర్ తో మాట్లాడి ఆశ్రమంలో చేర్పించారు. అభాగ్యులు, రోడ్ల వెంట తిరిగే వారిని చూసి మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్తున్న నేటి కాలంలో గుర్తించి తగు చర్యలు చేపట్టి మానవత్వాన్ని చాటిన సర్పంచ్ కాటం వెంకటేశం ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, పొట్లపల్లి నరసింహ తదితరు పాల్గొన్నారు

Leave a Reply