కర్నూలు బ్యూరో : జిల్లా వ్యాప్తంగా 6 గ్రామాల్లో పోలీసు అధికారులు ప్రతిరోజూ సమస్యాత్మక గ్రామాల్లో రాత్రి బస (గ్రామ నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూలు పోలీసులు రాత్రి బస (గ్రామ నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అల్లర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవడం పోలీసు అధికారుల బాధ్యత అని, అందుకోసం గ్రామాలలోని ప్రజలు కూడా తమ వంతు భాద్యతగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని తెలియజేశారు.