ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన
చింతూరు, ఆంధ్రప్రభ : మందుపాతర (ఐఈడీ) పేలి మహిళా మావోయిస్ట్(Maoist)కి తీవ్ర గాయాలైన ఘటన ఈ రోజు జరిగింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్(Bijapur) జిల్లాలోని మద్దేడు బందేపారా గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతరలు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో సోడి గుజ్జమ్మ(Sodi Gujjamma) అనే మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడింది. మందుపాతర పేలడంతో మహిళా మావోయిస్టుతో పాటు వచ్చిన మరో ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారు.
గ్రామస్థుల సమాచారం మేరకు..
ఈ విషయాన్నిస్థానిక గ్రామస్తుల నుండి సమాచారం అందుకున్నపోలీసు బృందం(Police team) గ్రామస్తుల సహాయంతో గాయపడిన మహిళా మావోయిస్టును దగ్గరలోని వైద్యశాల(Hospital)కు తరలించి ప్రథమ చికిత్సలు అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గాయపడిన మావోయిస్టు సోడి గుజ్జమ్మమావోయిస్టు దళంలో ఏడు సంవత్సరాలుగా మద్దీద్ ఏరియా(Maddid area) కమిటీలో ఏసీఎం కన్నబుచ్నాతో కలిసి పార్టీ సభ్యురాలిగా చురుకుగా పని చేస్తుంది. ఆమె 12-బోర్ ఆయుధాన్నికలిగి ఉన్నారు.