బెల్టు షాపులపై పోలీసుల దాడులు
కోటపల్లి, అక్టోబర్ 30,(ఆంధ్రప్రభ ):కోటపల్లి మండలంలోని లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై దాబాల పేరుతో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై ఎస్ఐ రాజేందర్ గురువారం సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు, ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు, దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

