ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐకి ఎస్పీ సత్కారం…

ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐకి ఎస్పీ సత్కారం…
దర్శి, ఆంధ్రప్రభ : సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలను ప్రకాశం జిల్లా ఎస్పీ పి హర్షవర్ధన్ రాజు సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలీసు శాఖలో విశేష సేవలందించిన దర్శి ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ కే భాష ను ఎస్పీ సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు.
సుదీర్ఘకాలం విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం ఆనందదాయకమని తెలిపారు.పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో బాధ్యతాయుతంగా జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, ఉద్యోగ విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
